25 July, 2026 | 3:06 PM

హనుమాన్ జయంతికి ప్రత్యేక ఏర్పాట్లు

31-05-2024 01:46 AM

యాదాద్రి భువనగిరి, మే 30 (విజయక్రాంతి): తెలంగాణ తిరుపతిగా పేరుగాం చిన యాదగిరిగుట్ట లక్ష్మీనర్సింహ స్వామి క్షేత్రపాలకుడు ఆంజనేయస్వామి జయంతి ఉత్సవాలు జూన్ 1న (శనివారం) వైభవం గా నిర్వహించడానికి ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. క్షేత్రపాలకుడికి అత్యం త విశిష్ట గల హనుమాన్ జయంతి వేడుకలను ప్రధానాలయం, విష్ణుపుష్కరిణీ, పాత గుట్ట ఆలయాల వద్ద ఘనంగా నిర్వహించనున్నట్టు ఆలయ కార్యనిర్వహణా ధికారి భాస్కర్‌రావు తెలిపారు.

ఈ ఉత్సవాల సందర్భంగా ఆలయాన్ని ప్రత్యేకంగా పుష్పాలంకరణలు జరుపనున్నారు. ఆంజనేయస్వామికి అష్టోత్తర శతమాన్య సూక్త పారాయణాలతో అభిషేకాలు, లక్షతమలపాకుల అర్చనలు శాస్త్రోక్తంగా నిర్వహించ నున్నారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12.30గంటల వరకు నిర్వహించే పూజా కార్యక్రమాల్లో భక్తులు విష్ణుపుష్కరిణిలోని ఆంజనేయస్వామి ఆలయంలో పాల్గొనవచ్చునని పేర్కొన్నారు. రూ. 516 ఆర్జిత రుసుం చెల్లించి దంపతులు పూజలో పాల్గొనవచ్చనని తెలిపారు.