25 July, 2026 | 1:23 PM

ప్రమాదాలు నివారించేందుకు జాగ్రత్తలు తీసుకోవాలి

31-05-2024 01:47 AM

సంగారెడ్డి కలెక్టర్ క్రాంతి వల్లూరి

సంగారెడ్డి, మే 30 (విజయక్రాంతి) : వానకాలం ప్రారంభానికి ముందుగానే అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ క్రాంతి వల్లూరి తెలిపారు. గురువారం సంగారెడ్డిలోని కలెక్టరేట్‌లో రెవె న్యూ, పంచాయతీరాజ్, ఆర్‌అండ్‌బీ ఇంజినీరింగ్, నీటిపారుదల శాఖ, అటవీశాఖ, వైద్య ఆరోగ్య, మున్సిపల్ శాఖ అధికారులతో వర్షాకాలం సీజ న్‌లో తీసు కో వాల్సిన జాగ్రత్తలపై సమీక్ష నిర్వహించా రు. గ్రామ పంచాయతీలు, మున్సిపాల్ పరిధిలో ఉన్న పాత ఇండ్లు, భవనాలను పంచాయతీ కార్యదర్శులు, మున్సిపాల్ కమిషనర్లు ఇతర శాఖల అధికారులు పరిశీలించి చర్యలు తీసుకోవాలన్నారు.