23 August, 2026 | 3:14 AM

ఏసీబీ వలలో రక్షక భటులు

23-08-2026 12:45 AM
  1. భూ వివాదంలో డబ్బు డిమాండ్ 
  2. ఏసీబీకి చిక్కిన చందానగర్ -ఎస్‌ఐ, ఇద్దరు కానిస్టేబుళ్లు
  3. కోనసాగుతున్న దర్యాప్తు 

శేరిలింగంపల్లి, ఆగస్టు 22 (విజయక్రాం తి): చందానగర్ పోలీస్ స్టేషన్‌కు చెందిన అడ్మిన్ సబ్ ఇన్స్‌పెక్టర్ బాలరాజు, కానిస్టేబు ల్ రాఘవ, కానిస్టేబుల్ రాజ్‌కుమార్లను అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు శనివారం లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. భూ సెటిల్మెంట్ విషయంలో ఓ బాధితుడి నుంచి లంచం డిమాండ్ చేసినట్లు ఆరోపణలున్నాయి. బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించ డంతో, ముందస్తు ప్రణాళిక ప్రకారం ఏసీబీ బృందం రంగంలోకి దిగింది.

లంచం తీసు కుంటున్న సమయంలోనే ఆ ముగ్గురినీ అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన చం దానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో కలకలం రేపింది. భూ వివాదాలను పరిష్కరించే పేరు తో పోలీసు సిబ్బంది డబ్బులు డిమాండ్ చేశారనే ఆరోపణల నేపథ్యంలో ఏసీబీ అధి కారులు పూర్తి వివరాలను సేకరిస్తున్నారు. పట్టుబడిన వారిని విచారించడంతోపాటు, లంచం డిమాండ్‌కు సంబంధించిన మొత్తం వ్యవహారంపై దర్యాప్తు కొనసాగుతోంది.