calender_icon.png 29 July, 2025 | 10:49 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఐడీపీఎల్ ప్రాంతంలో పేలుడు..

29-07-2025 02:30:24 AM

ఒకరు మృతి, మరొకరికి గాయాలు

కూకట్‌పల్లి, జూలై 28: కూకట్‌పల్లి ఐడీపీఎల్ ప్రాంతంలో సోమవారం గ్యాస్‌కట్టర్ పేలి, ఒకరు మృతి చెందగా, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఎండీ మోబిన్ (34), జమీల్ అహ్మద్ జీడిమెట్ల సిద్ధార్థ నగర్‌లో నివాసం ఉంటున్నారు. వీరిద్దరూ కలిసి సోమవారం ఐడీపీఎల్ ప్రాంతంలోని ఓ స్క్రాప్ దుకాణంలో గ్యాస్ కట్టర్‌తో వస్తువులను కట్ చేస్తుండగా గ్యాస్ కట్టర్ పేలింది. ఈ ప్రమాదంలో మోబిన్ అక్కడికక్కడే మృతి చెందాడు. జమీల్ అహ్మద్‌కు తీవ్రగాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. ఘటన స్థలానికి పోలీసులు చేరుకొని కేసు దర్యాప్తు చేస్తున్నారు.