21 May, 2026 | 11:29 PM

ఇంటి నంబర్ల జారీలో జాప్యం వద్దు

19-06-2024 12:35 AM

మున్సిపల్ చైర్‌పర్సన్ మంజుల

వికారాబాద్, జూన్ 18( విజయక్రాంతి) : ఇంటి నెంబర్లు జారీ చేయడంలో జాప్యం చేసినా, అవకతవకలకు పాల్పడినా చట్ట ప్రకారం చర్యలు తప్పవని వికారాబాద్ మున్సిపల్ చైర్‌పర్సన్ చిగుళ్లపల్లి మంజుల రమేష్ అన్నారు. మంగళవారం వికారాబాద్ మున్సిపల్ చైర్‌పర్సన్ ఛాంబర్‌లో కమీషనర్ జాకీర్ అహ్మద్, బిల్ కలెక్టర్లు, ఇతర సిబ్బందితో ఆమె సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా చైర్‌పర్సన్ మాట్లాడుతూ మున్సిపల్ పరిధిలోని ప్రజలకు ప్రభుత్వ నిబంధనల మేరకు సేవలందించడంతో పాటు ప్రభుత్వానికి ఆదాయం వచ్చే విధంగా పనిచేయాలన్నారు. మున్సిపల్ పరిధిలో కొత్తగా నిర్మిస్తున్న ఇళ్లకు ఇంటి నెంబ ర్లు కేటాయించడంలో రెవెన్యూ సిబ్బంది అవకతవకలకు పాల్పడితే కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు. ప్రభుత్వ నిబంధనల మేరకు మున్సిపాలిటీకి ఆదాయం వచ్చేలా రెవెన్యూ సిబ్బంది నిబద్ధతతో పనిచేయాలని ఆమె సూచించారు.