21 May, 2026 | 10:53 PM

రుణమాఫీపై రైతుల్లో అయోమయం

19-06-2024 12:37 AM

ఎఫ్‌డీసీ మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి 

గజ్వేల్, జూన్18: రైతులందరికీ రుణమాఫీ చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చి న సీఎం రేవంత్‌రెడ్డి ఇప్పుడు షరతులు పెట్టడం చేతకానితనమేనని ఎఫ్‌డీసీ మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి విమర్శించారు. మంగళవారం గజ్వేల్‌లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. రుణమాఫీపై పూటకో మాట చెబుతూ సీఎం రేవంత్‌రెడ్డి రైతులను అయోమయానికి గురిచేస్తున్నారని అన్నారు. ఆరు మాసాలుగా అభివృద్ధిని, సంక్షేమాన్ని గాలికి వదిలేసి కరెంటు, ఫోన్ ట్యాపింగ్, గొర్రెల స్కాం అంటూ పబ్బం గడుపుకుంటున్నారని మండిపడ్డారు. వెంటనే ఎన్నికల హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. సమావేశంలో జెడ్పీటీసీ పంగ మల్లేశం, పార్టీ పట్ట ణాధ్యక్షుడు నవాజ్‌మీరా, కృష్ణారెడ్డి, ఉప్పల మెట్టయ్య, అల్వాల బాలేష్, అత్తెల్లి శ్రీనివాస్, విరాసత్ అలీ,రవీందర్, బొల్లారం ఎల్లయ్య, నర్సింగరావు, ఉమర్ పాల్గొన్నారు.