డీసీపీ ఆఫీసులో ‘నో హెల్మెట్ నో ఎంట్రీ’
17-04-2026 12:23 AM
మంచిర్యాల, ఏప్రిల్ 16 (విజయక్రాంతి): రోడ్డు భద్రతను పెంపొందించేందుకు, హెల్మెట్ వినియోగంపై ప్రజల్లో చైతన్యం కల్పించేందుకు అరైవ్ -అలైవ్ కార్యక్రమంలో భాగంగా గురువారం మంచిర్యాల డీసీపీ కార్యాలయంలో ‘నో హెల్మెట్ నో ఎంట్రీ’ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డీసీపీ ఎగ్గడి భాస్కర్ మాట్లాడుతూ డీసీపీ కార్యాలయంతో పాటు జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్‌లలో పనిచేసే సిబ్బంది హెల్మెట్ లేకుండా వస్తే ఆవరణలోకి అనుమతించబడరని స్పష్టం చేశా రు. ట్రాఫిక్ నియమాలను పాటించాలని అధికారుల పిలుపునిచ్చారు.






