ఏజెన్సీ గ్రామాలకు ఊరట
- ఆరు హైలెవెల్ వంతెనలకు అనుమతి
వర్షాకాలంలో రాకపోకల సమస్యకు పరిష్కారం
జైనూర్, ఏప్రిల్ ౧౬ (విజయక్రాంతి): ఏజె న్సీ ప్రాంతంలోని గిరిజన గ్రామాలకు వర్షాకాలంలో ఎదురయ్యే రాకపోకల సమస్యకు పరిష్కారం దిశగా చర్యలు ప్రారంభమయ్యా యి. మూడు మండలాల్లో ఉన్న ఆరు లోలెవెల్ వంతెనల స్థానంలో హైలెవెల్ వంతెనల నిర్మాణానికి ప్రభుత్వం అనుమతులు మంజూ రు చేసింది. ప్రతి వర్షాకాలంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న గిరిజనులకు ఊరట లభించనుంది.
ప్రతి సంవత్సరం వర్షాలు కురిసిన ప్పుడు లోలెవెల్ వంతెనలపై నుంచి వాగులు ఉధృతంగా ప్రవహించడం వల్ల గ్రామాల మధ్య రాకపోకలు పూర్తిగా నిలిచిపోతున్నా యి. అత్యవసర వైద్య సేవలు పొందడానికి, నిత్యావసర అవసరాల కోసం బయటకు వెళ్లాల్సిన పరిస్థితుల్లో గిరిజనులు తీవ్ర ఇబ్బం దులు పడుతున్నారు. కొన్నిసార్లు వరద ప్రవాహాన్ని దాటే ప్రయత్నంలో ప్రమాదాలకు గురైన ఘటనలు చోటుచేసుకున్నాయి.
జైనూ ర్, సిర్పూర్ (యు), లింగాపూర్ మండలాల్లో దశాబ్దాల క్రితం నిర్మించిన లోలెవెల్ వంతెనలు వర్షాకాలంలో నీటిమునిగిపోవడంతో గ్రామాలకు రాకపోకలు నిలిచిపోతున్నాయి. వరద తగ్గే వరకు గంటల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంటోంది. ఈ సమస్య తీవ్ర తను గుర్తించిన జిల్లా కలెక్టర్ కె. హరిత లోలెవెల్ వంతెనలను పరిశీలించి, వాటి స్థానంలో హైలెవెల్ వంతెనల నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశిం చారు.
లింగాపూర్ మండలం ఆలీగూడ నుం చి కంచనపల్లి వెళ్లే మార్గంలో మూడు హైలెవెల్ వంతెనలు నిర్మించనున్నారు. సిర్పూర్ (యు) మండలంలోని కోహినూర్ గ్రామానికి వెళ్లే మార్గంలో రెండు వంతెనలకు అనుమతి లభించింది. అలాగే జైనూర్ మండలం లేండిగూడ నుంచి గౌరీ గ్రామానికి వెళ్లే మార్గంలో మరో హైలెవెల్ వంతెన నిర్మాణానికి ఆమో దం లభించింది. వంతెనలు పూర్తయితే వర్షాకాలంలో రాకపోకలకు అంతరాయం లేకుం డా గిరిజన గ్రామాలకు నిరంతర రవాణా సౌక ర్యం అందుబాటులోకి వస్తుందని స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.






