13 July, 2026 | 4:33 PM

Breaking News

ఆల్బెండజోల్ మాత్రలు తీసుకోవడం ద్వారా నులిపురుగులను నివారించవచ్చు   •   విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీ   •   ప్రజావాణి దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలి: జిల్లా కలెక్టర్ కె.హరిత   •   కాంగ్రెస్ పార్టీలో 'జక్కిడి' మంటలు   •   లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాల మంజూరు పత్రలు అందజేత   •   ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు నులిపురుగుల నివారణ మాత్రల పంపిణీ   •   పిల్లల ఆరోగ్య రక్షణలో నులిపురుగుల నిర్మూలన ఎంతో ముఖ్యం   •   ఆరోగ్యమైన సమాజాన్ని నిర్మిద్దాం   •   రచ్చపల్లి అంగన్వాడీ కేంద్రంలో అల్బెండజోల్ మాత్రల పంపిణీ   •   ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో వనమహోత్సవం   •  

బంగ్లా యువతులతో అక్రమ వివాహాలు వద్దు

27-05-2025 01:09 AM

పౌరులను హెచ్చరించిన చైనా ప్రభుత్వం

బీజింగ్, మే 26: అక్రమ వివాహాలపై చైనా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పెళ్లి చేసుకోవడానికి దే శంలో యువతుల కొరత ఏర్పడటం తో దానిని అధిగమించడానికి అక్రమమార్గంలో వివాహాలు చేసుకొంటున్న ట్టు గుర్తించిన చైనా ప్రభుత్వం అ లాంటి పనులు చేయొద్దని పౌరులను హెచ్చరించింది. బంగ్లా యువతులతో అక్రమ వివాహాలు వద్దని, అక్కడ పెళ్లిళ్లు చేసుకొనేముందు అన్ని అంశాలను జాగ్రత్తగా పరిశీలించాలని సూ చించింది.

మోసపూరిత క్రాస్ బోర్డర్ డేటింగ్ వీడియోలు, సమాచారం, అనధికారిక మ్యాట్రిమోనీల విషయం లో జాగ్రత్తగా ఉండాలని బంగ్లాదేశ్‌లోని చైనా రాయబార కార్యాలయం తమ పౌరులకు ఆదేశాలు జారీ చేసిం ది. చైనాలో కొన్నేళ్లుగా వివాహాల సం ఖ్య తగ్గుముఖం పడుతూ వస్తోంది. దాదాపు మూడుకోట్ల మంది యువకులకు జీవిత భాగస్వాములు దొరక ని పరిస్థితి నెలకొంది.

దీనివల్ల కొందరు చైనా యువకులు తమ వివాహాల కోసం బంగ్లాదేశ్ యువతులను చైనాకు అక్రమ రవాణా చేస్తున్నట్టు సమాచారం. చట్ట విరుద్ధంగా ఈ పెళ్లిళ్ల తంతు నడుస్తోందని, ఆ తర్వాత న్యాయపరమైన చిక్కులకు దారితీయొచ్చని ఎంబసీ తన అడ్వైజరీలో పేర్కొంది. 

ఈ తరహా పెళ్లిళ్లు చేసుకుంటే మానవ అక్రమరవాణా కింద చట్టపరమైన చర్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించింది. బంగ్లా చట్టాల ప్రకారం మానవ అక్రమరవాణాకు పాల్పడి, దోషిగా తేలితే ఏడు సంవత్సరాల జైలు శిక్ష, కేసు తీవ్రతను బట్టి యావజ్జీవ, మరణశిక్షలు కూడా ఉండొచ్చన్నారు.