కొత్తగా 75 ట్రామా కేర్ సెంటర్లు
19-06-2024 12:53 AM
మంత్రి రాజనర్సింహా
హైదరాబాద్, జూన్ 18 (విజయక్రాంతి) : రాష్ట్రంలో కొత్తగా 75 ట్రా మా కేర్ సెంటర్లు ఏర్పాటు చేస్తామని రాష్ట్రవైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహా తెలిపారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ..డయాగ్నస్టిక్ సెంటర్లను ప్రభుత్వ ఆస్పత్రులకు అనుసంధానం చేస్తామన్నారు. దవాఖానలపై పర్యవేక్షణకు మూడు రకాల టాస్క్‌ఫోర్స్ బృందాలు, మౌలిక వసతుల కోసం గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేస్తామన్నారు.






