16 July, 2026 | 11:10 AM

ఇకపై ఇండియాలో సినిమాలు చేయదట

06-12-2024 12:00 AM

టాలీవుడ్, లేదంటే ఇతర భాషల్లో క్లిక్ అయ్యాక తారలంతా బాలీవుడ్ వైపు చూడటం సర్వసాధారణం. మరి బాలీవుడ్ భామల పరిస్థితేంటి? దాదాపు బాలీవుడ్ ముద్దుగు మ్మలంతా అక్కడ క్లిక్ అయ్యాక అక్కడే కొనసాగుతారు. కానీ ప్రియాంక చోప్రా మాత్రం తన ప్రొడక్షన్ కంపెనీ ‘పర్పుల్ పెబెల్ పిక్చర్స్’ సహా అమెరికాకు షిఫ్ట్ అయిపోయారు. బాలీవుడ్‌లో ప్రియాంక ప్రొడక్షన్ కంపెనీ నుంచి చాలా అద్భుత మైన చిత్రాలు వచ్చాయి. ‘వెంటిలేటర్’, ‘పానీ’ వంటి జాతీయ అవార్డు పొందిన సినిమాలను సైతం ఈ సంస్థ రూపొందించింది. అయితే, ఇకపై ప్రియాంక ఇండియాలో చిత్రాలను చేయ ర ట! ఆమె తల్లి మధు ఓ ఇంటర్వ్యూలో ఈ విష యాన్ని వెల్లడించారు. ప్రియాంక కూ డా తాను ఎందరినో ఫిలిం మేకర్స్‌ను కలిశానని, ఎన్నో స్క్రిప్ట్ పరిశీలించానని తెలిపారు. హిందీలో ఏదో ఒక సినిమా చేయాలనుకుంటున్నానని, కానీ ఈ ఏడాది బిజీగా ఉండటంతో సాధ్యపడలేదని తెలిపారు. ప్రియాంక హాలీవుడ్ చిత్రాల్లో నటించాలని నిర్ణయించుకున్నప్పుడు ప్రస్తుతం బాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా కొనసాగు తున్నావని.. హాలీవుడ్‌కి వెళితే ఆది నుంచి మొదలు పెట్టాలని చెప్పానని మధు తెలిపారు. కాబట్టి పూర్తిగా బాలీవుడ్‌ను వదిలి వేయవద్దని చెప్పారట. మరి ప్రియాంక చోప్రా తల్లి మాటను ఎంతమేర ఆచరణలో పెడతారో చూడాలి.