16 July, 2026 | 10:58 AM

మరోమారు గుణశేఖర్‌తో..

06-12-2024 12:00 AM

గుణశేఖర్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘యుఫోరియా’. ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న దురాగతాలను కథాంశంగా తీసుకుని ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం సినిమా నిర్మాణ దశలో ఉంది. రీసెంట్‌గా ఫస్ట్ షెడ్యూల్ చిత్రీకణ పూర్తయ్యింది. తాజాగా సెకండ్ షెడ్యూల్‌ను ప్రారంభించారు. ఈ క్రమంలోనే సినిమాకు సంబంధించిన స్పెషల్ అప్‌డేట్ ఇస్తూ సెట్స్ నుంచి ఓ స్పెషల్ వీడియో విడుదల చేశారు. ఈ వీడియోలో భూమిక మనకు సెట్స్‌లో కనిపించారు. ఆమె మేకప్ వేసుకోవటం, షూటింగ్‌లో పాల్గొనటం వంటి సన్నివేశాలను మనం ఆ వీడియోలో చూడొచ్చు. ‘ఒక్కడు’ తరువాత భూమిక, గుణశేఖర్ కలిసి చేస్తున్న సినిమా ఇదే కావడం గమనార్హం. భూమికను దృష్టిలో ఉంచుకుని గుణశేఖర్ ఓ పవర్‌ఫుల్ రోల్‌ను క్రియేట్ చేశారు. ఈ చిత్రంలో సారా అర్జున్, నాజర్, రోహిత్, విఘ్నేశ్ గవిరెడ్డి తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటించారు. గుణ హ్యాండ్ మేడ్ ఫిల్మ్స్ బ్యానర్‌పై రాగిణి గుణ సమర్పణలో యుఫోరియా చిత్రాన్ని నీలిమ గుణ నిర్మిస్తున్నారు.