14 June, 2026 | 2:26 AM

ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై కొత్త జీవోలు వద్దు

14-06-2026 12:59 AM
  1. పాత విధానమే కొనసాగించాలి
  2. ఎంపీ ఆర్ కృష్ణయ్య 

ముషీరాబాద్, జూన్ 13(విజయక్రాంతి): ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకంపై వరుసగా కొత్త జీవోలు జారీ చేస్తూ విద్యార్థులను, కళాశాల యాజమాన్యాలను గందరగోళానికి గురిచేయవద్దని18 బీసీ సంఘాలు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాయి. శనివారం విద్యానగర్‌లోని బీసీ భవన్‌లో జాతీయ బీసీ సంక్షేమ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ ర్యాగ అరుణ్ కుమార్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎంపీ ఆర్.కృష్ణయ్య ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు.

జీవో 7ను రద్దు చేసి జీవో 8, 9 లను జారీ చేయడం సమస్యలను మరింత పెంచిందన్నారు. ఫీజులు, స్కాలర్‌షిప్‌లను నేరుగా విద్యార్థుల ఖాతాల్లో జమ చేయడం వల్ల పేద విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉందని, రెవెన్యూ రికవరీ(ఆర్‌ఆర్) చట్టాన్ని విద్యార్థులపై ప్రయోగించ డం అమానుషమని విమర్శించారు. ప్రభు త్వం ముందుగా పెండింగ్‌లో ఉన్న రూ.6 వేల కోట్ల బకాయిలను విడుదల చేసి, గతం లో అమలైన విధానాన్నే కొనసాగించాలని ఆయన డిమాండ్ చేశారు.

ఈ అంశంపై ముఖ్యమంత్రి అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని కోరారు. లేనిపక్షంలో రాష్ట్రవ్యా ప్తంగా ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ సమావేశంలో నేతలు రాములు యాదవ్, రాజేందర్, పర్లగోర్ల మోడీ రాందే వ్, వంశీమోహన్ యాదవ్, రమేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.