16 June, 2026 | 11:11 PM

ఆర్టీసీ ఉద్యోగులకు ప్రగతి చక్ర అవార్డులు

15-06-2024 01:57 AM

కరీంనగర్ సిటీ, జూన్ 14:  కరీంనగర్ రీజియన్ పరిధిలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన ఉద్యోగులకు ప్రగతి చక్ర అవార్డులను ప్రదానం చేశారు. శుక్రవారం కరీంనగర్ బస్ స్టేషన్ సమావేశ మందిరంలో నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా డీటీసీ పీ పురుషోత్తం హాజరై, మాట్లాడారు.  అనుభవజ్ఞులైన డ్రైవర్లతో ఇతర డ్రైవర్లకు అవగా హన నిర్వహించడంతో ప్రమాదాలు నివారించే అవకాశం ఉంటుందని చెప్పారు.  కార్యక్రమంలో జోన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సీ వినోద్ కుమార్, రీజనల్ మేనేజర్ సుచరిత, డిప్యూటీ రీజనల్ మేనేజర్లు సత్యనారాయణ, భూపతిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.