06-12-2025 12:00:00 AM
మహేశ్వరం, డిసెంబర్ 5 (విజయక్రాంతి) : మూడో విడత స్థానిక సంస్థల నేపథ్యంలో మహేశ్వరం, కందుకూరు మండలాలో పండుగ వాతావరణంలో నామినేషన్లు పండుగ వాతావరణం లో నామినేషన్ల పర్వం కొనసాగుతుంది. ఆయా మండలాలలో అధికార, ప్రతి పక్షం పార్టీలకు చెందిన పలువురు అభ్యర్థులందరూ తమ మద్దతుదారులతో కలిసి నామినేషన్లను ఆయా క్లస్టర్ ల రిటర్నింగ్ అధికారులకు సమర్పించారు.
అనంతరం అభ్యర్థులు మాట్లాడుతూ ప్రజలు తమకు మద్దతుగా ఉండి గెలిపిస్తే తమ గ్రామాలను ఆదర్శంగా తీర్చిదిద్దుతామని హామీల వర్షం కురిపిస్తున్నారు. శుక్రవారంతో నామినేషన్ల ప్రక్రియ చివరి రోజు కావడంతో భారీగా అభ్యర్థుల ఆయమండలలో నామినేషన్ దాఖలు చేసేందుకు తరలివచ్చారు. పలు క్లస్టర్లో ఐదు తర్వాత కేంద్రాల తరలివచ్చిన అభ్యర్థుల నుంచి నామినేషన్లను క్లస్టర్లో ఐదు తర్వాత కేంద్రాల తరలివచ్చిన అభ్యర్థుల నుంచి నామినేషన్ల పత్రాలను అధికారులు తీసుకుంటున్నారు.