06-12-2025 12:00:00 AM
సర్పంచ్ అభ్యర్థి అంతటి భాగ్యలక్ష్మి
సంస్థాన్ నారాయణపూర్, డిసెంబర్ 5 (విజయ క్రాంతి): సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రం అభివృద్ధిలో ఆదర్శంగా ఉండేలాగా తీర్చిదిద్దుతానని గ్రామంలో పారిశుద్ధ్యం తాగునీటి సమస్యలను రాకుండా చర్యలు చేపడతానని సర్పంచ్ అభ్యర్థి అంతటి భాగ్యలక్ష్మి అన్నారు. బిజెపి బలపరిచిన బిఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థిగా శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం మాట్లాడుతూ గ్రామ అభివృద్ధికి తనవంతుగా సేవ చేసే అవకాశం కల్పించాలని వివేకులైన యువత ఆలోచించి తనను గెలిపించాలని కోరారు.
గ్రామంలోని 14 వార్డులలో ఎలాంటి పారిశుధ్య సమస్యలు తలెత్తకుండా మంచినీటి సమస్యలు రాకుండా చర్యలు తీసుకుంటానని ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి కష్టాలలో భాగం పంచుకుంటానని అన్నారు. గ్రామ అభివృద్ధి లక్ష్యంగా తాను పోటీ చేస్తున్నానని అందరి సహకారంతో గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతానని తెలిపారు. ఈ కార్యక్రమంలో బిఆర్‌ఎస్ మండల అధ్యక్షులు నర్రి నరసింహ, గ్రామ శాఖ అధ్యక్షులు తెలంగాణ బిక్షం, మాజీ సర్పంచ్ శ్రీహరి, ఏర్పుల అంజమ్మ, రాచకొండ రవి, కొండ గిరి, రాములు సాగర్, రాచకొండ గిరి, బుగ్గ రాములు, ఇంద్రసేనారెడ్డి, శివాజీ, వెంకటేష్ పాల్గొన్నారు.