calender_icon.png 7 December, 2025 | 1:31 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎన్నికల్లో ప్రజలు నిర్భయంగా ఓటు వేయాలి

06-12-2025 12:00:00 AM

మెదక్ డీఎస్పీ ప్రసన్న కుమార్

పాపన్నపేట, డిసెంబర్ 5 : స్థానిక ఎన్నికల్లో ప్రజలు నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని మెదక్ డీఎస్పి ప్రసన్నకుమార్ పిలుపునిచ్చారు. శుక్రవారం మండల కేంద్రం పాపన్నపేట దుర్గమ్మ గైని వద్ద ఎన్నికల అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. సర్పంచ్ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల ప్రవర్తన నియమావళిని కఠినంగా అమలు చేస్తూ, ప్రలోభాలను నివారించేందుకు జిల్లా పోలీస్ శాఖ పకడ్బందీ చర్యలు చేపట్టిందన్నారు.

అభ్యర్థులు, వారి అనుచరులు డబ్బు పంచడం, ఓటర్లను ప్రలోభాలకు గురి చేయడం వంటి చర్యలపై కేసులు నమోదు చేస్తామన్నారు. నిర్ణీత సమయంలోపు అభ్యర్థులు తమ ఎన్నికల ప్రచారాన్ని ముగించాలని, పోలింగ్ బూత్ వద్దకు పార్టీ కండువాలకు అనుమతి లేదన్నారు. ప్రశాంత వాతావరణంలో ఈ ఎన్నికలు జరగాలన్నారు. ఈసందర్బంగా మెదక్ గ్రామీణ సీఐ జార్జ్, స్థానిక ఎస్‌ఐ శ్రీనివాస్ గౌడ్, సిబ్బంది, గ్రామ ప్రజలు ఉన్నారు.