24 June, 2026 | 2:06 AM

హెచ్‌సీఏ, బీసీసీఐలకు వరంగల్ కోర్టు నోటీసులు

24-06-2026 12:00 AM

హైదరాబాద్, జూన్ 23 : తెలంగాణ జి ల్లాల యువక్రికెటర్లకు జరుగుతున్న అన్యాయంపై టీసీఏకు చెందిన క్రికెటర్లు కోర్టును ఆశ్రయించారు. హెచ్‌సీఏ తీరుతో తెలంగాణ క్రికెట్‌లో నెపోటిజాన్ని వ్యతిరేకిస్తూ హన్మకొండకు చెందిన యువ క్రికెటర్లు మరింగం టి నవరసన్, విష్ణుదాస్ శశాంక్ కశ్యప్ దాఖ లు చేసిన పిటిషన్‌ను హన్మకొండ 4వ అదనపు జూనియర్ సివిల్ జడ్జి విచారించారు. ఈ క్రమంలో హెచ్‌సీఏ, బీసీసీఐలతో పాటు వరంగల్ క్రికెట్ అసోసియేషన్‌కు నోటీసులిచ్చింది.

మూడు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశాలు జారీ చేస్తూ తర్వాతి విచారణను జూలై 17కు వాయిదా వేసింది. నాలుగు దశాబ్దాలుగా తెలంగాణ క్రికెట్‌ను కొందరి కుటుంబాలు, వర్గాలు గుత్తాధిపత్యంగా మార్చేసాయని, తద్వారా వేలాది జిల్లా క్రికెటర్ల కలలు చిద్రమయ్యాయని టీసీఏ ప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేస్తారు. నెపోటిజం నశించి, ప్రతిభకు న్యాయం జరగాలనే నినాదంతో రాష్ట్రవ్యాప్తంగా పోరాటా న్ని ఉధృతం చేస్తామని తెలిపారు.