బఫర్‌జోన్ ఇళ్లకు నోటీసులు
- కాలనీ వాసులతో కలిసి మాజీ మేయర్ ఆందోళన
- కాలనీ లో పర్యటించిన ఎమ్మెల్యే గంగుల
- ఇటుక కూడా తీయనీయ్యమనిహెచ్చరిక
కరీంనగర్, ఆగస్టు 6 (విజయ క్రాంతి): కరీంనగర్ లోయర్ మానేరు డ్యాం కట్టకు ఆనుకొని 11 కిలోమీటర్లకు పరిధిలో 30 మీటర్లు దాటి ఇంటి నిర్మాణాలు చేపట్టి ని వాసం ఉంటున్నవారికి ఎస్సారెస్పీ అధికారు లు తాజాగా నోటీసులు జారీ చేశారు. మీరు బఫర్ జోన్ పరిధిలో ఇంటి నిర్మాణాలు చేపట్టారని నోటీసులు అందించడంతో పలు కాలనీవాసులు బుధవారం ఆందోళనకు ది గారు. డ్యాం కట్టకు ఆనుకొని అనేక ప్రభుత్వ భవనాలు ఉన్నాయి. అయితే ఈ ప్రభుత్వ క ట్టడాలకు అధికారులు ఎలాంటి నోటీసులు ఇవ్వలేదు. నగరపాలక సంస్థకు చెందిన ఫిల్ట ర్ బెడ్ మిషన్ భగీరథ వాటర్ ట్యాంకులు, తిమ్మాపూర్లోని ఆర్టీవో కార్యాలయం, కేంద్రీ య విద్యాలయం, స్పోరట్స్ పాఠశాలలు ఉ న్నాయి. శాతవాహన ఫార్మసీ కళాశాల కూ డా ఈ పరిధిలోనే ఉంది. వీటికి నోటీసులు ఇవ్వకుండా తమకు నోటీసులు ఇవ్వడమేమిటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
- 30 మీటర్ల వరకే:- మాజీ మేయర్ సునీల్ రావు
ఎస్సారెస్సీ అధికారులకు ఎఫ్‌ఎండీ పరిధిలోని 30 మీటర్ల స్థలం వరకే అజమాయి షీ ఉంటుంది తప్పితే 30 మీటర్ల పరిధి దాటి ఏలాంటి కార్యక్రమాలు చేపట్టే అధికారం ఎస్సారెస్పీకి లేదని నగర మాజీ మేయర్, బీజేపీ నాయకుడు సునీల్ రావు పేర్కొన్నారు. వారి పరిధి దాటి అవగాహన లేకుం డా పేద ప్రజలను భయభ్రాంతులకు గురి చేయడం మానుకోవాలని హెచ్చరించా రు. ఈ సందర్భంగా మాజీ కార్పొరేటర్ చొ ప్పరి జయశ్రీతో కలిసి కాలనీవాసులకు ధై ర్యం చెప్పారు. ఈ అంశాన్ని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ దృష్టికి తీసుకెళ్తానని పేర్కొన్నారు.
ఇటుక కూడా తీయనియ్యం...
-బఫర్ జోన్లో ఉందంటూ కాలనీవాసులకు నోటీసులు పంపారు.. ఒక్క ఇ టుక కూడా తొలగించనీయమని కాలనీవాసులకు అండగా ఉంటామని మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అ న్నారు. బుధవారం ఆయన కాలనీవాసులతో కలిసి మాట్లాడారు. ఈ విష యంలో కాలనీవాసులకు అండగా బీఆ ర్‌ఎస్ పార్టీ ఉంటుందన్నారు. ఈ విషయంలో పోరాటం చేసేందుకు వెనుకాడ మని గం గుల కమలాకర్ కాలనీవాసులకు భరోసాకల్పించారు.
మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్






