calender_icon.png 13 August, 2025 | 4:20 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చెంచాగిరి రాజకీయాలు మానుకోవాలి

07-08-2025 12:40:14 AM

నర్సారెడ్డికి పావులుగా మారిన కాంగ్రెస్ దళిత నాయకులు

తూంకుంట నర్సారెడ్డిని అరెస్ట్ చేయాలని గజ్వేల్ ఏసిపికి  వినతి పత్రం అందజేసిన దళిత సంఘాల నాయకులు 

గజ్వేల్, ఆగస్టు 6: కొమ్ము విజయ్ పైన కులం పేరుతో దూషిస్తూ దాడి చేసిన మాజీ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు తూంకుంట నర్సారెడ్డిని వెంటనే అరెస్టు చేయాలని  దళిత సంఘాల సంఘాల నాయకులు గజ్వేల్ ప్రజ్ఞాపూర్ ఏసిపి గారికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలో ఉన్న కొందరు చెంచా నాయకులను  ఉపయోగించి ర్యాలీ చేస్తూ దళిత సంఘాలపై, దళితులపై దుష్ప్రచారం చేపిస్తున్న నర్సారెడ్డిని వెంటనే అరెస్టు చేయాలని కోరారు.

కాంగ్రెస్ పార్టీలో దళిత నేతలని రాజకీయంగా ఎదుర్కోలేక దాడులకు దిగడం ఏమిటని ప్రశ్నించారు. రాజకీయంగా ఎదగడాన్నీ జీర్ణించుకోలేకపోతున్నారన్నారు.  ఒకవేళ కొమ్ము విజయ్ తప్పు ఏదైనా తప్పు చేసి ఉంటే పార్టీ పరంగా క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలి గానీ గుండాగిరి చేస్తూ  బెదిరించే రాజకీయాలు ఏమిటని నర్సారెడ్డిని ప్రశ్నించారు. జగదేవపూర్ కార్యక్రమంలో కూడా ఒక కార్యకర్త పైన చేయి చేసుకోవడం వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిందన్నారు.

గజ్వేల్ లో  గుండాలను పెంపొందిస్తూ గుండాగిరి చేస్తున్నారన్నారు. కాంగ్రెస్ ఎస్సీ సెల్ అని చెప్పుకొని ఈరోజు ర్యాలీ తీసిన నాయకులంతా కాంగ్రెస్ ఎస్సీ సెల్ లో వాళ్ళ పోస్టులు ఏంటో బహిరంగంగా చెప్పాలన్నారు.  దళితులకు వ్యతిరేకంగా ర్యాలీ తీయడంతోనే  పెయిడ్ ఆర్టిస్టులని అర్థమవుతుందన్నారు.

నర్సారెడ్డిని అరెస్టు చేసేంతవరకు పోరాడుతామన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ నియోజకవర్గ ఇన్చార్జి ఉబ్బన్ ఆంజనేయులు, ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు మైసరాములు, పొన్నాల కుమార్,  ముండ్రాతి కృష్ణ,  రాజు,  కిషన్   మహేష్, రమేష్, స్వామి తదితరులు పాల్గొన్నారు.