calender_icon.png 14 August, 2025 | 7:46 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎండు గంజాయి పట్టివేత

07-08-2025 12:38:20 AM

మునిపల్లి, ఆగస్టు 6 :  కర్ణాటక రాష్ట్రం బీదర్ నుంచి హైదరాబాద్ కు అక్రమంగా తరలిస్తున్నఎండు గంజాయిని కంకల్ టోల్ ప్లాజా వద్ద  ఎక్సైజ్, ప్రొహిబిషన్ శాఖ అధికారులు పట్టుకొని స్వాధీనం చేసుకున్నారు. ఎక్సైజ్, ప్రొహిబిషన్ శాఖ జిల్లా అధికారి నవీన్ చంద్ర ఆదేశాల మేరకు బుధవారం అక్రమంగా ఎండు గంజాయి సరఫరా చేస్తున్నట్టు నమ్మదగిన సమాచారం మేరకు మునిపల్లి మండలం కంకోల్ టోల్ ప్లాజా వద్ద ఎక్సైజ్ అధికారులు వాహనాల తనిఖీలు చేపట్టారు.

ఇదే క్రమంలో ఓ కారుపై అనుమానం వచ్చి తనిఖీ చేయగా అందులో 1.45కేజీల ఎండు గంజాయి ఉన్నట్టు వారు గుర్తించారు. ఇస్నాపూర్ కు చెందిన విరేష్, సాయి కిరణ్ రెడ్డి, రాహుల్ అనే ముగ్గురు వ్యక్తులు అక్రమంగా ఎండు గంజాయిని కార్ లో బీదర్ నుండి హైదరాబాద్ కు  తరలిస్తున్నట్టు తెలిపారు.

నిందితుల నుండి 1.145 కేజీ ఎండు గంజాయిని, స్విఫ్ట్ కార్, నాలుగు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకుని సంగారెడ్డి ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ కు తరలించినట్టు ఎక్సైజ్ అధికారులు తెలిపారు. ఈ దాడుల్లో డిటిఎఫ్ ఎస్త్స్ర హనుమంతు, కానిస్టేబుల్స్ అంజిరెడ్డి, అరుణజ్యోతి, శివ, రాజేష్ ఉన్నారు.