calender_icon.png 5 December, 2024 | 12:28 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీ క్యాటగిరీ సీట్లకు నోటిఫికేషన్

01-08-2024 01:10:37 AM

హైదరాబాద్, జూలై 31 (విజయక్రాంతి): 2024 విద్యాసంవత్స రానికి సంబంధించి బీ క్యాటగిరి (మేనేజ్‌మెంట్ కోటా) సీట్లకు నోటిఫికే షన్‌ను ఉన్నత విద్యామండలి బుధవారం విడుదల చేసింది. బీఈ, బీటెక్, బీఫార్మసీ, ఫార్మ్ డి కోర్సులకు సంబంధించిన సీట్లను భర్తీచేస్తారు. ఆగస్టు 29లోపు ప్రక్రియను పూర్తి చేయాలని పేర్కొన్నారు. ఆగస్టు 1 నుంచి 9వ తేదీ వరకు దరఖాస్తు చేసుకునేందుకు విద్యార్థులకు అవకాశం కల్పించాలన్నారు. అడ్మిషన్ల జాబితాను సెప్టెంబర్ 10లోపు సమర్పించాలని కళాశాల యాజమాన్యాలకు ఆదేశాలు జారీ చేశారు. రెండో విడుత సీట్ల కేటాయింపు ప్రక్రియ బుధవారంతో ముగియడంతో బీక్యాటగిరీ సీట్ల భర్తీకి నోటిఫికేషన్‌ను విడుదల చేశారు. ఆయా కాలేజీల వారీగానే ఈ సీట్లను భర్తీ చేయనున్నారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తులను స్వీకరించి, జేఈఈ మెయిన్, ఎంసెట్ ర్యాంకులు, ఎన్‌ఆర్‌ఐ కోటా ఆధారంగా సీట్లను భర్తీ చేయాలని నోటిఫికేషన్‌లో సూచించారు. కన్వీనర్ కోటా సీటు లభించని విద్యార్థులు మేనేజ్‌మెంట్ కోటా సీటు కోసం ప్రయత్నిస్తారు. నోటిఫికేషన్‌లో పొందుపర్చిన నిబంధనలు పాటించాలని, లేకుంటే చర్యలు తప్పవని కాలేజీలకు సూచించారు.