13 July, 2026 | 1:19 AM

ఎన్‌టీఏ ఆఫీసుకు తాళం

28-06-2024 03:21 AM
  • ఎన్‌టీఏ ఆఫీసు ఎదుట ఎన్‌ఎస్‌యూఐ ఆందోళన

ఆఫీసులోకి దూసుకెళ్లి తాళం వేసిన ఆందోళనకారులు

న్యూఢిల్లీ, జూన్ 27 : యూజీసీ నెట్, నీట్ యూజీ వంటి పరీక్షల్లో ప్రశ్నాపత్రాల లీకేజీ, అక్రమాల వ్యవహారం దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతోంది. ఈ పరీక్షలు నిర్వహించిన జాతీయ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ)పై పెద్ద ఎత్తున విమర్శలు వినిపిస్తున్నాయి. ఎన్‌టీఏను రద్దు చేయాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. పేపర్ లీకేజీలకు వ్యతిరేకంగా పలు విద్యార్థి సంఘాలు ఢిల్లీలో ఆందోళనలు చేస్తున్నాయి. గురువారం యూత్ కాంగ్రెస్, ఎన్‌ఎస్‌యూఐ కార్యకర్తలు ఢిల్లీలోని ఎన్‌టీఏ ఆఫీసు ఎదుట ఆందోళనకు దిగారు. ఈ క్రమంలోనే వారిలో దాదాపు 100 మంది కార్యకర్తలు ఎన్‌టీఏ ఆఫీసులోకి దూసుకెళ్లారు. అనంతరం లోపలి నుంచి తాళం వేశారు. దీంతో, ఆఫీసు వద్ద తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఆందోళనకారులు ఎన్‌టీఏ ఆఫీసు లోపలికి పరుగులు పెడుతున్న దృష్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.