ఎన్టీఆర్‌కు నేడు శస్త్రచికిత్స
టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్‌కు ఇటీవల ‘డ్రాగన్’ సినిమా షూటింగ్ సమయంలో ప్రమాదవశాత్తూ గాయమైంది. దీంతో ప్రముఖ వైద్యులు ఎన్టీఆర్‌ను పరీక్షించి చికిత్స అందించారు. ఈ గాయానికి ఎలాంటి మేజర్ శస్త్రచికిత్స అవసరం లేదని వైద్యులు స్పష్టం చేశారు. ఆయన భుజానికి మైనర్ ఇంజ్యూరీ మాత్రమే అయినందున 6 నుంచి 8 వారాల పాటు సమయం పడుతుందని వైద్యుల బృందం వెల్లడించింది. అప్పటివరకు ఆయనను బెడ్ రెస్ట్ తీసుకోవాలని వైద్యులు సూచించారు.
ఇదిలావుండగా, తాజాగా మంగళవారం ఎన్టీఆర్ టీమ్, ఆయన కార్యాలయం సోషల్ మీడియా వేదికగా ఒక ప్రకటన విడుదల చేశాయి. వైద్యుల సలహా మేరకు ఎన్టీఆర్ సర్జరీ చేయించుకోనున్నారని టీమ్ వెల్లడించింది. హైదరాబాద్ కిమ్స్ ఆసుపత్రిలో బుధవారం శస్త్ర చికిత్స జరగనుంది. సర్జరీ తర్వాత ఆయన ఆరోగ్య పురోగతి గురించి ఎప్పటికప్పుడు తెలియజేస్తామని ఎన్టీఆర్ కార్యాలయం తెలిపింది.






