calender_icon.png 17 January, 2026 | 11:13 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నాణ్యమైన మొక్కలను అందించే విధంగా నర్సరీలను తీర్చిదిద్దాలి

17-01-2026 09:47:22 PM

గరిడేపల్లి,(విజయక్రాంతి): నాణ్యమైన మొక్కలను అందించే విధంగా గ్రామాలలో ఉన్న నర్సరీలను తీర్చిదిద్దాలని కోదాడ క్లస్టర్ ఏపీడి యామిని అన్నారు. గరిడేపల్లి మండల కేంద్రంతో పాటు మండలంలోని ఎల్బీనగర్, అప్పన్నపేట, కోదండరామపురం గ్రామపంచాయతీలలో  నిర్వహిస్తున్న నర్సరీలను శనివారం ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నర్సరీలలో  మొక్కల పెంపకంపై నిర్లక్ష్యం వహించవద్దని, నాణ్యమైన మొక్కలను అందించే విధంగా నర్సరీలను తీర్చిదిద్దాలని ఆమె సూచించారు. నర్సరీలలో మొక్కల పెంపకం పై సంబంధిత పంచాయతీ కార్యదర్శులు,ఫీల్డ్ అసిస్టెంట్లు, ఏపీవో లు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ ఉండాలని అన్నారు. అనంతరం ఉపాధి హామీ పథకంలో భాగంగా నిర్మించిన పశువుల షెడ్లను ఆమె సందర్శించారు. కార్యక్రమంలో ఎంపీడీవో సరోజ, గరిడేపల్లి గ్రామ సర్పంచ్ మేకపోతుల వెంకటమ్మ చంద్రయ్య, ఎంపీఓ ఇబ్రహీం,ఏపీవో సురేష్, పంచాయతీ కార్యదర్శులు, ఫీల్డ్ అసిస్టెంట్లు తదితరులు పాల్గొన్నారు.