calender_icon.png 17 January, 2026 | 11:18 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జిల్లాస్థాయి క్రికెట్ పోటీల్లో మొదటి స్థానంలో నిలిచిన పొనుగోడు జట్టు

17-01-2026 09:50:23 PM

గరిడేపల్లి,(విజయక్రాంతి): మండల పరిధిలోని పొనుగోడు లో నిర్వహించిన జిల్లా స్థాయి క్రికెట్ పోటీల్లో పొనుగోడు గ్రామానికి చెందిన జట్టు విజేతగా నిలిచింది.గెలుపొందిన పిసిసి పొనుగోడు జట్టుకు ప్రథమ బహుమతి జె.పి.ఆర్ ఫౌండేషన్ దాత శ్రీనివాస్ రెడ్డి అందించిన 30 వేల16 రూపాయలను, షీల్డ్ ను గ్రామ సర్పంచ్ కటకం వేణు,ఉప సర్పంచ్ జోగు అరవింద రెడ్డి శనివారం అందజేశారు.

ద్వితీయ బహుమతిని పొనుగోడుకు చెందిన జట్టు విజయం సాధించగా కేజీ ఫౌండేషన్ దాత సర్పంచ్ కటకం వేణు 20వేల 16 తో పాటు షీల్డ్ ను అందించగా ద్వితీయ బహుమతి పొందిన జట్టుకు అందించారు.తృతీయ బహుమతిని మినీ వర్మ జట్టు గెలుచుకోగా,నాల్గవ బహుమతిని మల్లారెడ్డిగూడెం విజయం సాధించగా,ఐదవ బహుమతిని మునగాలకు చెందిన క్రికెట్ జట్టు గెలుచుకుంది.విజయం సాధించిన జట్లకు నగదు బహుమతి,షీల్డ్ లను బహూకరించారు.