5 March, 2026 | 11:06 PM

ఆరోగ్య శాఖలో మరో 371 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

11-10-2024 07:08 PM

హైదరాబాద్,(విజయక్రాంతి): తెలంగాణ ఆరోగ్య శాఖలో మరో 371 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. 272 నర్సింగ్ ఆఫీసర్లు, 99 ఫార్మాసిస్ట్ పోస్టులకు మెడికల్ రిక్రూట్ మెంట్ బోర్టు నోటిఫికేషన్ విడుదల చేసింది. గత నెలలో 2050 నర్సింగ్ పోస్టులకు అదనంగా 272 నర్సింగ్ ఆఫీసర్ల పోస్టులతో కలిపి మొత్తం 2,322 నర్సింగ్ ఆఫీసర్లు, 99 ఫార్మాసిస్టు పోస్టులకు అనుబంధ నోటిఫికేషన్ జారీ చేసింది. దరఖాస్తులకు అక్టోబర్ 14వ తేదీతో తుది గడువు ముగియగా.. నవంబర్ 17న ఆన్ లైన్ పరీక్ష నిర్వహించనున్నారు.