13 March, 2026 | 3:36 PM

సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులుగా న్యాలపట్ల రాజు

06-12-2025 08:38 PM

ముకరంపుర (విజయక్రాంతి): సిపిఐ కరీంనగర్ జిల్లా కార్యవర్గ సభ్యులుగా నగరానికి చెందిన న్యాలపట్ల రాజును ఎంపిక చేసినట్లు సిపిఐ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్ ఒక ప్రకటనలో తెలిపారు. నగరంలోని కట్టారాంపూర్ కు చెందిన రాజు గత 30 సంవత్సరాలకు పైగా సిపిఐలో పనిచేస్తున్నారని, పార్టీలో, ప్రజా సంఘాలలో  వివిధ హోదాల్లో పనిచేశారని, ప్రస్తుతం సిపిఐ నగర  సహాయ కార్యదర్శిగా కొనసాగుతున్నారని, పార్టీ నిర్మాణ దృష్ట్యా, జిల్లా వ్యాప్తంగా పార్టీ బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషించడం కోసం రాజును జిల్లా కార్యవర్గంలోకి తీసుకున్నామని పేర్కొన్నారు. జిల్లా కార్యవర్గంలో చోటు కల్పించినందుకు జిల్లా పార్టీ నాయకత్వానికి న్యాలపట్ల రాజు కృతజ్ఞతలు తెలిపారు.