06-12-2025 08:41:39 PM
హుస్నాబాద్: గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా, నిష్పక్షపాతంగా జరిగేలా ప్రజలకు పూర్తి భరోసా కల్పించే ఉద్దేశంతో, సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ డివిజన్ పోలీసులు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. శనివారం ఏసీపీ సదానందం ఆధ్వర్యంలో అక్కన్నపేట మండలం కట్కూరులో భారీ ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్న నేపథ్యంలో, ప్రజలు ఎటువంటి భయం, ఒత్తిడి లేకుండా పోలింగ్‌లో పాల్గొనేలా విశ్వాసం కల్పించడమే ఈ ఫ్లాగ్ మార్చ్ ముఖ్యోద్దేశమని ఏసీపీ అన్నారు.
ప్రజలు నిర్భయంగా, ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా పోలింగ్‌లో పాల్గొనాలన్నారు. ఎన్నికల సందర్భంగా శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై కఠినంగా వ్యవహరించేందుకు పోలీసులు పూర్తి సన్నద్ధంగా ఉన్నారు. ప్రజలు ఎలాంటి భయాలకు గురికావాల్సిన అవసరం లేదన్నారు. ఈ ఫ్లాగ్ మార్చ్ లో హుస్నాబాద్ సీఐ శ్రీనివాస్, అక్కన్నపేట ఎస్సై పాల్గొన్నారు.