17 March, 2026 | 3:52 AM

మోదీతోనే ఓబీసీరిజర్వేషన్లు సాధ్యం

17-03-2026 02:41 AM
  1. కాంగ్రెస్ ఓబీసీల సంక్షేమాన్ని అభివృద్ధిని విస్మరించింది
  2. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్నాలో ఎంపీ ఆర్.కృష్ణయ్య

ముషీరాబాద్, మార్చి 16 (విజయక్రాంతి): ప్రధాని మోదీ హయాంలోనే చట్టసభలలో ఓబీసీల రిజర్వేషన్లు సాధించితీరుతామని బీజేపీ రాజ్యసభ సభ్యలు ఆర్.కృష్ణయ్య అన్నా రు.  అఖిల భారత ఓబిసి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు అంగిరేకుల వరప్రసాద్ యాదవ్ నాయకత్వంలో  డిల్లీలోని జంతర్ మంతర్ లో జరిగిన ‘ఓబీసీ‘ ల మహాధర్నాలో ఎంపీ ఆర్.కృష్ణయ్య  ప్రసంగించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమగ్ర జనగణనలో ఓబీసీ జనగణన చేపట్టాల్సిన అవ సరం ఉందని, ఈ విషయంపై ప్రధాని మోదీ సానుకూలంగా ఉన్నారన్నారు. ఓబీసీ వర్గాలు తమ హక్కులు సాధించుకొనేందుకు రాజకీయపార్టీలను పక్కనపెట్టి సంఘటితంగా  పోరాడాలని కృష్ణయ్య పిలుపునిచ్చారు. 5 దశాబ్ధాలుగా దేశాన్ని పాలించిన కాంగ్రెస్ పార్టీ ఓబీసీల సంక్షేమాన్ని, అభివృద్ధిని  విస్మరించిందన్నారు.

ఓబీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ, ఏర్పాటుపై కేంద్ర ప్రభత్వం మంత్రి వర్గ ఉపసంఘాన్ని లేదా పార్లమెంటరీ సంయుక్త కమిటిని ఏర్పాటు చేయాల్సిన అవశక్యత ఉం దని, 5 వేలకోట్లతో ప్రత్యేక ప్యాకేజీని ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి  చేశారు. రాజ్యసభ సభ్యు లు బీదా మస్తాన్ రావు  మాట్లాడుతూ.. ఏపీ రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం వల్లే దేశవ్యాప్తంగా  ఓబీసీల సమగ్రాభివృద్దికి, అస మానతలు అధిగమించేందుకు  ‘ఓబీసీ సబ్-ప్లాన్’ చట్టిన్ని కేంద్ర ప్రభుత్వం పార్లమెం ట్‌లో ప్రవేశపెట్టి ఆమోదించాలన్నారు.

ఈ కార్యక్రమంలో  సుబ్బారావు, వివిధ రాష్ట్రాల నాయకులు  డి.రమాదేవి, సోనూ, మనుబర్తి లలిత, ఆదిలక్షి ఇలంగన్‌యాదవ్, డి.తేజస్విని, ఝాన్సీ, బత్తుల వెంకటేష్,  విజయ బాబా, రమణ్ సింగ్, దోడ్ సుజాన్సింగ్, బైసింగ్ పేరయ్య, హైమ,  ప్రదీప్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.