14 July, 2026 | 4:51 AM

జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం నిర్వహణ

14-07-2026 01:23 AM

పెబ్బేరు, జూలై 13: జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా పెబ్బేరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు ఆల్బెండాజోల్ మాత్రలను పంపిణీ చేసి సేవింపజేశారు. ఈ సందర్భంగా మెడికల్ ఆఫీసర్ డాక్టర్ చంద్రశేఖర్ మాట్లాడుతూ పేగు పురుగుల వల్ల రక్తహీనత, పోషకాహార లోపం, పిల్లల ఎదుగుదల మందగించడం వంటి సమస్యలు తలెత్తే అవకాశముందని, వాటి నివారణకు ప్రభుత్వం ప్రతి ఏడాది ఉచితంగా ఆల్బెండాజోల్ మాత్రలను అందజేస్తోందని తెలిపారు. కార్యక్రమంలో సూపర్వైజర్లు దామోదర్, లీలమ్మ, అసిస్టెంట్ రాజశేఖర్, ఆశా వర్కర్లు, కళాశాల ప్రిన్సిపల్ భద్రాసేన్, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.