14 July, 2026 | 4:49 AM

ఎస్‌ఐఆర్‌లో బీఎల్‌ఏలు చురుగ్గా పనిచేయాలి: నిరంజన్‌రెడ్డి

14-07-2026 01:24 AM

పెబ్బేరు, జూలై 13: ఎస్‌ఐఆర్ కార్యక్రమంలో బీఎల్‌ఏలు చురుగ్గా పనిచేసి ప్రతి ఓటరికి న్యాయం జరిగేలా కృషి చేయాలని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి సూచించారు. సోమవారం పెబ్బేరు మండలంలోని సూగూరు, రంగాపూర్, బున్యాదిపూర్ గ్రామాల్లో పర్యటించిన ఆయన ఎస్‌ఐఆర్ కార్యక్రమం పురోగతిని పరిశీలించారు.

బున్యాదిపూర్లో కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసిన సర్పంచ్ విజయ్ గౌడ్, గ్రామ కార్యదర్శిని సన్మానించారు. అనంతరం బీఆర్‌ఎస్ కార్యకర్తల కుటుంబాలను పరామర్శించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు..