డ్రింకర్స్‌ను అబ్జర్వ్‌చేసి సాయి క్యారెక్టర్ చేశా
ధర్మ, ఐశ్వర్యశర్మ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న సినిమా ‘డ్రింకర్ సాయి’. ‘బ్రాండ్ ఆఫ్ బ్యాడ్ బాయ్స్’ అనేది ఈ చిత్రానికి ట్యాగ్‌లైన్. కొన్ని వాస్తవ ఘటనల ఆధారంగా దర్శకుడు కిరణ్ తిరుమలశెట్టి తెరకెక్కిస్తున్నారు. ఎవరెస్ట్ సినిమాస్, స్మార్ట్ స్క్రీన్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై బసవరాజు శ్రీనివాస్, ఇస్మాయిల్ షేక్, బసవరాజు లహరీధర్ నిర్మిస్తున్నారు. డిసెంబర్ 27న ఈ సినిమా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర కథానాయకుడు ధర్మ మంగళవారం మీడియాతో సినిమా విశేషాలను పంచుకున్నారు.
* నేను ‘సింధూరం’ సినిమాలో నటించాను. మొదట ఒప్పుకున్న ఫస్ట్ మూవీ ‘డ్రింకర్ సాయి’నే. ‘సింధూరం’ ఫస్ట్ రిలీజ్ అయ్యింది. కాబట్టి ఇది నా రెండో చిత్రం అయ్యింది. ఈ కథ విన్నప్పుడు ఎగ్జుటై అయ్యాను. వాస్తవంగా ఒక వ్యక్తి జీవితంలో జరిగిన కథ ఇది. నేను వెళ్లి ఆ వ్యక్తిని కలిశాను. అతని లైఫ్‌లో జరిగిన విషయాలన్నీ తెలుసుకున్నాను.
* వాస్తవ ఘటనలకు కొంత ఫిక్షన్ కలిపి మూవీ చేశాం. ఈ సినిమా 2019లో ప్రీ ప్రొడక్షన్ స్టార్ట్ అయ్యింది. లాస్ట్ ఇయర్ షూటింగ్ చేశాం. డైరెక్టర్ మొదట అనుకున్న కథకు లాక్ డౌన్‌లో మరికొన్ని మార్పులు చేసి రూపొందించారు. మారుతి గారి దగ్గర రైటర్‌గా వర్క్ చేసిన ఆయన ఎంతో అంకితభావంతో ఈ సినిమా తీశారు.






