17 April, 2026 | 2:59 PM

ఓబుళాపురం మైనింగ్ కేసు వాయిదా

10-06-2025 12:00 AM

నేడు మళ్లీ విచారించనున్న తెలంగాణ హైకోర్టు

హైదరాబాద్, జూన్ 9 (విజయక్రాంతి): ఓబుళాపురం మైనింగ్ కేసుపై సోమవారం తెలంగాణ హైకోర్టు విచారణ చేపట్టి మంగళవారానికి వాయిదా వేసింది.  సీబీఐ కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ దోషులు గాలి జనార్దన్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, రాజగోపాల్, అలీఖాన్ వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. సీబీఐ కోర్టు తీర్పుపై తమకు అభ్యంతరాలు ఉన్నాయని పిటిషన్లలో పేర్కొన్నారు.

కేసు విచారణ కొనసాగుతూ ఉండగానే గాలి జనార్దన్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి జైలుశిక్ష అనుభవించారని వారి తరఫు న్యాయవాదులు కోర్టులో వాదించారు. సీబీఐ తరఫు న్యాయవాదులు స్పందిస్తూ.. జనార్దన్‌రెడ్డి,  శ్రీనివాస్‌రెడ్డి తప్పు చేసినందువల్లే కోర్టు వారికి శిక్ష విధించిందన్నారు.