27-07-2025 12:00:00 AM
-ఉచిత కన్సల్టేషన్, ఐవీఎఫ్ స్క్రీనింగ్‌పై డిస్కౌంట్
హైదరాబాద్ సిటీ బ్యూరో, జూలై 24 (విజయక్రాంతి): జూలై 25న ప్రపంచ ఐవీఎఫ్ దినోత్సవం సందర్భంగా మెడికవర్ ఫెర్టిలిటీ, హైటెక్ సిటీ, హైదరాబాద్ సంతానలేమి గురించి అవగాహన పెంచడానికి, సంతాన సాఫల్య చికిత్సను మరింత అందుబాటులోకి తీసుకురావడానికి ప్రత్యేక ఆఫర్‌ను ప్రకటించింది. పరిమిత సమయం వరకు దంపతుల సంతాన సాఫల్య స్క్రీనింగ్ ప్యాకేజీపై రాయితీతో పాటు ఐవీఎఫ్ ప్రక్రియ, ఐయూఐ ప్రక్రియపై ప్రత్యేక డిస్కౌంట్లను అందిస్తోంది. ఐవీఎఫ్ దినోత్సవం రోజున నిపుణులైన బృందం, అధునాతన సాంకేతికత, కరుణతో కూడిన సంరక్షణతో, సంతానం కోరుకునే వారికి మార్గనిర్దేశం చేయడానికి సిద్ధంగా ఉన్నామని మెడికవర్ ఫెర్టిలిటీ, హైటెక్ సిటీలోని ఫెర్టిలిటీ స్పెషలిస్ట్ డాక్టర్ రాగసుధ వి అన్నారు.
ప్రత్యేక ఆఫర్ ముఖ్యాంశాలు
దంపతుల సంతాన సాఫల్య స్క్రీనింగ్ ప్యాకేజీ (రూ.8000 విలువైనది, కేవలం రూ.900మాత్రమే). నిపుణులైన ఐవీఎఫ్ కన్సల్టెంట్‌తో ఉచితంగా దంపతుల కన్సల్టేషన్. అల్ట్రాసౌండ్ స్కాన్, సెమెన్ అనాలసిస్, యాంటీ-ముల్లెరియన్ హార్మోన్ పరీక్ష. ఈ ఆఫర్ జూలై 25 నుంచి 31 వరకు హైదరాబాద్లోని హైటెక్ సిటీలోని మెడికవర్ ఫెర్టిలిటీ క్లినిక్‌లో మాత్రమే చెల్లుబాటు అవుతుంది. అపాయింట్మెంట్ కోసం 7669406742/ 040-68334455 నంబరులో సంప్రదించాలని యాజమాన్యం కోరింది.