27-07-2025 12:00:00 AM
వరల్డ్ హెపటైటిస్ డే (జూలై 28) సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా కోట్ల మందిని ప్రభావితం చేస్తున్న, చాపకింద నీరులా ప్రమాదకరమైన లివర్ వ్యాధులైన వైరల్ హెపటైటిస్‌ను గమనించి, నిర్ధారించే, సమయానికి చికిత్స తీసుకోవాలన్న అత్యవసరతను ప్రతి ఒక్కరు తెలుసుకోవాలని గ్లెనిగల్స్ హాస్పిటల్, లక్డీకాపూల్, హైదరాబాద్‌లో లీడ్ ట్రాన్స్‌ప్లాంట్ హెపటాలజిస్ట్, లివర్ స్పెషలిస్ట్ అయిన డాక్టర్ కావ్య తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... “హెపటైటిస్ చివరివరకు గుర్తించలేరు.
ప్రపంచవ్యాప్తంగా 300 మిలియన్ల మందికి పైగా వైరల్ హెపటైటిస్‌తో బాధపడుతున్నారు. చాలా మంది దీని గురించి తెలియకపోవడం వల్ల ఇది సిరోసిస్, లివర్ ఫెయిల్యూర్ లేదా లివర్ కాన్సర్‌కు దారి తీస్తుంది. భారతదేశంలో హెపటైటిస్ సీ క్రానిక్ లివర్ డిసీజులకు ప్రధాన కారణాలు. ఈ సంవత్సరం గ్లోబల్ థీమ్ ‘హెపటైటిస్ ఇక వేచి చూడదు’ అని పేర్కొంటూ, వెంటనే చర్య తీసుకోవాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తోంది. స్క్రీనింగ్, వ్యాక్సినేషన్ లేదా చికిత్సలో ఏ చిన్న ఆలస్యం అయినా గుండెను గణనీయంగా దెబ్బతీసే ప్రమాదం లేదా ప్రాణాపాయ పరిస్థితికి దారి తీస్తుంది” అని చెప్పారు.
స్క్రీనింగ్ చాలా ముఖ్యం
నిర్దిష్ట కారణం లేని అలసట, ఆకలి కోల్పోవడం లేదా లివర్ ఫంక్షన్ టెస్టులలో అసాధారణ ఫలితాలు ఉన్నవారు, డయాబెటిస్ డ్రగ్ వినియోగం ఉన్నవారు, అసురక్షిత లైంగిక సంబంధాలు కలిగినవారు, 2001కి ముందు రక్త బదిలీ పొందినవారు, హెపటైటిస్ బీ/సీ ఉన్నవారితో కాంటాక్టులో ఉన్నవారు స్క్రీనింగ్ చేయించుకోవాలి. సాధారణ రక్త పరీక్షతో వైరస్‌ను గుర్తించవచ్చు. హెపటైటిస్ వ్యాక్సిన్‌తో నివారించగలిగే వ్యాధి. హెపటైటిస్ కి ప్రస్తుతం చిన్న పిల్‌తో పూర్తి చికిత్స అందుబాటులో ఉంది. మన లివర్ కేవలం ఆల్కహాల్ డిటాక్స్ చేయడానికే కాదు ఇది హార్మోన్లు, ఇమ్యూనిటీ, మెటబాలిజం, భావోద్వేగాలను కూడా నియంత్రిస్తుంది. కాబట్టి దీన్ని జాగ్రత్తగా సంరక్షించాలి అని డాక్టర్ కావ్య తెలిపారు.
ఉచిత లివర్ ఆరోగ్య శిబిరం
వరల్డ్ హెపటైటిస్ డే సందర్భంగా గ్లీనీగిల్స్ హాస్పిటల్, లక్డీకాపూల్, హైదరాబాద్‌లో సోమవారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఉచిత ఆరోగ్య శిబిరం నిర్వహించనుంది. ఉచితంగా అందించే సేవలు: ఉచిత డాక్టర్ కన్సల్టేషన్, ఫైబ్రో స్కాన్ (లివర్ ఆరోగ్య పరీక్ష), బీపీ చెకప్, జీఆర్‌బీఎస్ (షుగర్ టెస్ట్), హెపటైటిస్ సీ స్క్రీనింగ్ పరీక్షలు ఉంటాయి. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు ఉపయోగించుకోవాలని ఈ సందర్భంగా డాక్టర్ కావ్య తెలిపారు.