11 August, 2026 | 1:50 AM

స్లమ్ డాగ్ నుంచి ఆఫీసర్ గౌరీ హెగ్డే వచ్చింది!

11-08-2026 12:00 AM

డైనమిక్ ఫిల్మేమేకర్ పూరి జగన్నాథ్, వెర్సటైల్ హీరో విజయ్ సేతుపతి మొదటిసారిగా  కలసి చేస్తున్న పాన్-ఇండియా యా క్షన్ డ్రామా ’స్లమ్ డాగ్: 33 టెంపుల్ రోడ్’. రా ఎమోషన్స్, పవర్ఫుల్ యాక్షన్, మిస్టరీ అంశాలతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఇప్పటికే టబు ఫస్ట్ లుక్ను విడుదల చేసిన మేకర్స్.. తాజాగా ఆమె పాత్రకు సంబధించిన పవర్ఫుల్ గ్లింప్స్ను విడుదల చేశారు. నగరంలోని స్లమ్ ఏరియా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ గ్లింప్స్.. అక్కడి రఫ్ అండ్ గ్రిటీ వాతావరణాన్ని పరిచయం చేస్తూ మొ దలవుతుంది. ఆ తర్వాత కారు దిగుతూ, సిగరెట్ వెలిగించి, పరిస్థితులను తన కంట్రో ల్లోకి తీసుకునే గౌరి హెగ్డేగా టబు ఎంట్రీ ఇచ్చారు.

స్థానిక గూండాకు వార్నింగ్ ఇచ్చి, ఆ వెంటనే చెంపదెబ్బ కొట్టే సన్నివేశం ఆమె పాత్ర ఎంత పవర్ఫుల్గా ఉండబోతోందో చె బుతోంది. గౌరి హెగ్డే కేవలం పవర్ఫుల్ ఆఫీసర్ మాత్రమే కాదు.. ఎలాంటి పరిస్థితుల్లో నూ వెనక్కి తగ్గని, భయమంటే తెలియని, కాంప్రమైజ్ కాని మహిళగా ఆమె పాత్రను డిజైన్ చేశారు.   చివర్లో గౌరి హెగ్డే, డిప్యూటీ కమిషనర్, ఇన్కమ్ ట్యాక్స్ అంటూ టబు త నను తాను పరిచయం చేసుకునే సీన్ హై లైట్‌గా నిలిచింది. ఈ ఇంట్రడక్షన్లో పూరి జగన్నాథ్ మార్క్ కనిపిస్తోంది.

గ్లింప్స్లో విజయ్ సేతుపతి పాత్రకు సంబంధించిన కొన్ని షాట్లు కూడా ఆకట్టుకున్నాయి.  ఈ చిత్రం లో సంయుక్త హీరోయిన్‌గా నటిస్తుండగా, దు నియా విజయ్ నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించనున్నారు. బ్రహ్మాజీ, వీ టీవీ గణేష్  కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సామ్ కె. నాయుడు సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం సమకూరుస్తున్నారు. సంతోష్ నూజిల్లా ఎడిటింగ్. పూరి జగన్నాథ్, ఛార్మీ కౌర్ తమ పూరి కనెకట్స్ బ్యాన్ప జేబీ నారాయణరావు కొండ్రొల్లా జేబీ మోషన్ పిక్చర్స్ తో కలిసి ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. టైటిల్ అనౌన్స్మెంట్, ఫస్ట్ లుక్, టీజర్ తర్వాత తాజాగా విడుదలైన ఈ గ్లింప్స్ సినిమాపై అంచనాలను మరింత పెంచింది.