‘రెడ్‌మీ నోట్ 17 5జీ’ ఆవిష్కరణ
హైదరాబాద్, ఆగస్టు 10 (విజయక్రాంతి) : హైదరాబాద్‌లో షావోమి ఇండియా తాజా రెడ్‌మీ నోట్ 17 5జీ స్మార్ట్‌ఫోన్‌ను ఆవిష్కరించింది. గచ్చిబౌలిలోని సెల్ బే షోరూంలో టాలీవుడ్ నటి చెరుకూరి మానస చౌదరి, షావోమి అసోసియేట్ డైరెక్టర్ ప్రవీణ్ అష్టగి, సీనియర్ మార్కెటింగ్ మేనేజర్ మహమ్మద్ ఇఫ్తేకర్, సెల్ బే ఎండీ సోమ నాగరాజుతో కలిసి ఫోన్‌ను లాంచ్ చేశారు.
ఈ సందర్భంగా మానస చౌదరి మాట్లాడుతూ.. ఆధునిక సాంకేతిక ఉత్పత్తులు ప్రజల నిత్యజీవితంలో భాగమయ్యా యని అన్నారు. ఆకర్షణీయమైన డిజైన్, అధునాతన కెమెరా వ్యవస్థ, ఆధునిక ఫీచర్లతో రెడ్మీ నోట్ 17 వినియోగదారులను ఆకట్టుకుంటుందని పేర్కొన్నారు. రెడ్మీ నోట్ 17లో 8,000ఎంఏహెచ్ బ్యాటరీ, సిలికాన్-కార్బన్ బ్యాటరీ టెక్నాలజీ, ట్రూ కలర్ అమో ల్డ్ డిస్‌ప్లే, స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్ వంటి ప్రత్యేకతలు ఉన్నాయి.






