23 July, 2026 | 2:41 AM

అధికారిక లాంఛనాలతో డి.శ్రీ‌నివాస్ అంత్యక్రియలు

29-06-2024 11:17 AM

హైదరాబాద్: మాజీ మంత్రి ధర్మపురి శ్రీనివాస్ అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. రేపు జరగనున్న అంత్యక్రియలకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారికి సూచించారు. గతంలో సమైక్య రాష్ట్రంలో మంత్రిగా, రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేసిన ధర్మపురి శ్రీనివాస్ రాష్ట్రానికి చేసిన సేవలు చిరస్మరణీయం. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న కాంగ్రెస్ సీనియర్ నేత ఈరోజు కన్నుమూశారు. తెల్లవారుజామున 3.30 గంటలకు శ్రీనివాస్ తుదిశ్వాస విడిచినట్లు ఆయన కుమారుడు ట్విట్టర్ ద్వారా తన తండ్రి మరణాన్ని ప్రకటించారు.