23 July, 2026 | 1:42 AM

డీఎస్ మృతి పట్ల చంద్రబాబు సంతాపం

29-06-2024 11:33 AM

అమరావతి: మాజీ మంత్రి, పీసీసీ మాజీ అధ్యక్షుడు ధర్మపురి శ్రీనివాస్ మరణం పట్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంతాపం తెలిపారు. డీఎస్ కుటుంబసభ్యులకు ఏపీ సీఎం ప్రగాఢ సానుభూతి తెలిపారు. సుదీర్ఘకాలం రాజకీయాల్లో డీఎస్ తనదైన ముద్రవేశారని కొనియాడారు. డీఎస్ ఎప్పుడూ హుందాగా రాజకీయాలు చేశారని చంద్రబాబు గుర్తుచేశారు. నమ్మిన సిద్ధాంతం కోసం డీఎస్ పనిచేశారని పేర్కొన్నారు.