ఘనంగా బాల్క సుమన్ జన్మదిన వేడుకలు
మందమర్రి (విజయక్రాంతి): చెన్నూర్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే, మంచిర్యాల జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు బాల్క సుమన్ జన్మదిన వేడుకలు శనివారం చెన్నూరు, మందమర్రి పట్టణాల్లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బిఆర్ఎస్ చెన్నూర్ నియోజకవర్గం ఇంచార్జ్ డాక్టర్ రాజా రమేష్ ఆధ్వర్యంలో చెన్నూర్ పట్టణం లోని శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పట్టణంలోని దర్గాలో కార్యకర్తలతో కలసి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు.
సాయి అన్నపూర్ణ వృద్ధాశ్రమంలో వృద్ధులకు అన్న ప్రసాదం నిర్వహించారు. అనంతరం పట్టణంలోని బస్టాండ్ వద్ద అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బిఆర్ఎస్ చెన్నూరు నియోజక వర్గం ఇంచార్జ్ డాక్టర్ రాజారమేష్ మాట్లాడుతూ నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత బాల్క సుమన్ నిండు నూరేళ్ళు ఆరోగ్యంగా ఉండాలని, ఇలాంటి పుట్టిన రోజు వేడుకలు మరెన్నో జరుపుకోని, రాబోయే రోజుల్లో ఉన్నత పదవులని అలంకరించాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ ప్రజా ప్రతినిధులు, యూత్, మహిళా నాయకురాలు, పాల్గొన్నారు.
మందమర్రిలో..
పట్టణంలోని పాత బస్టాండ్ జయశంకర్ సార్ చౌరస్తాలో పెద్దపల్లి మాజీ ఎంపీ, చెన్నూరు మాజీ ఎమ్మెల్యే, బిఆర్ఎస్ పార్టీ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు బాల్క సుమన్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించి కేక్ కట్ చేసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ రానున్న రోజుల్లో బాల్క సుమన్ ఉన్నత శిఖరాలకు ఎదగాలని, ఆ భగవంతుని ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో మందమర్రి పట్టణ బిఆర్ఎస్, టీబీజీకేస్ యూనియన్ నాయకులు, అన్ని గనుల ఫిట్ కార్యదర్శిలు,వార్డు అధ్యక్షులు,యూత్ విద్యార్థి సోషల్ నాయకులు, మహిళ నాయకురాలు పాల్గొన్నారు.




