హోటల్ పై అధికారుల మెరుపు దాడి
28-02-2026 10:28 AM
ఆరు గ్యాస్ సిలిండర్లు సీజ్
కాగజ్ నగర్,(విజయక్రాంతి): కాగజ్ నగర్ లోని పెట్రోల్ పంప్ ఏరియా లోని న్యూ స్వాగత్ రెస్టారెంట్(New Swagat Restaurant) పై శుక్రవారం రాత్రి ఎన్ఫోర్స్మెంట్ అధికారులు రాజ్ కుమార్, శ్రీనివాస్ ఆకస్మిక దాడులు నిర్వహించారు. నిబంధనలకు విరుద్ధంగా వినియోగిస్తున్న ఆరు రాయితీ గ్యాస్ సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు. గతంలోనూ ఇదే హోటల్ లో గృహ వినియోగ సిలిండర్ల వాడకంపై కేసులు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. సదరు యాజమాన్యం పై చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులకు నివేదిస్తామన్నారు.




