అదృశ్యమైన బాలుడు చెరువులో శవమై తేలిన ఘటన
28-02-2026 10:30 AM
కొల్చారం (విజయక్రాంతి): అదృశ్యమైన బాలుడు చెరువులో శవమై తేలిన ఘటన కొల్చారం మండలంలో(Kulcharam Mandal) చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... మండల పరిధిలోని పోతిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన తనుష్ (4) శుక్రవారం మధ్యాహ్నం నుండి కనిపించకుండా పోయాడు. శనివారం ఉదయం స్థానిక చెరువులో శవమై కనిపించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది.




