calender_icon.png 6 May, 2025 | 7:25 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భూభారతి ఆర్‌ఓఆర్ చట్టంపై అధికారులకు అవగాహన ఉండాలి

17-04-2025 01:24:29 AM

యాదాద్రి భువనగిరి, ఎయిర్టెల్ 16 ( విజయ క్రాంతి): భూభారతి - కొత్త ఆర్‌ఓఆర్ చట్టం ప్రతి ఒక్క రెవెన్యూ  అధికారి, సిబ్బంది  అవగాహన కలిగి ఉండాలని రెవె న్యూ అదనపు కలెక్టర్  వీరారెడ్డి అన్నారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో రెవెన్యూ అదనపు  కలెక్టర్ జిల్లాలోని తాసిల్దారులు, డిప్యూటీ తహసిల్దార్లు, రెవెన్యూ సిబ్బందికి  భూ - భారతి కొత్త ఆర్‌ఓఆర్ చట్టం గురించి  అవగాహన కల్పించడం జరిగింది.

ఈ సంద ర్భంగా  ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రవేశపెట్టిన భూభారతి పై పై సమస్యలు ఉంటే సులభతరంగా  చట్టం ద్వారా పరిష్క రించవచ్చని అన్నారు. ధరణి సమస్యలు పరిష్కారంకు భూమి ఉన్న ప్రతి మనిషికి ఆధార్ కార్డు మాదిరిగానే భూధార్ కార్డులు  ప్రతి భూమి ఉన్న వారికి ప్రభుత్వం అందిస్తుందన్నారు. గ్రామాలలో రేపటి నుండి జరగబోయే అవగాహన సదస్సులు, క్యాంపులు ద్వారా ప్రజలకు అర్థం అయ్యేలా అవగాహన కల్పించి వారి యొక్క భూ సమస్యలకు ఈ చట్టం  సత్వర పరిష్కారం అవుతుందని తెలియజేయాలన్నారు. 

ప్రజ లకు అర్థం అయ్యేలా పవర్ పాయింట్  ప్రెజెంటేషన్, కర పత్రాలు, పోస్టర్ల ద్వారా ప్రజలకు అవగాహన కల్పించాలని, ప్రతి ఒక్క గ్రామ సమావేశంలో రైతులు, ప్రజల సమస్యలు తెలుసుకుని  ఈ చట్టం ద్వారా పరిష్కరించాలన్నారు. ప్రజలకు భూ సమ స్యలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు ప్రభుత్వం తీసుకొచ్చిన భూ భారత్ ను ప్రజలోకి విస్తృతంగా తీసుకెళ్లాలని తెలిపారు. సమావేశంలో ఆర్డిఓ కృష్ణారెడ్డి, జిల్లాలోని రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.