ఇక యూఎస్ ఐటీ, బ్యాంకులే టార్గెట్
- వీటికి ఆయా దేశాల్లో ప్రజలు 1కి.మీ దూరంలో ఉండాలి
హెచ్చరించిన ఇరాన్
దుబాయ్ ఎయిర్‌పోర్టు సమీపంలో డ్రోన్ దాడి
నలుగురికి గాయాలు, వీరిలో ఒకరు భారతీయుడు
టెహ్రాన్, మార్చి11: అమెరికా సంయుక్త దాడులకు ప్రతీకారం తీర్చు కుంటామని ఇరాన్ మిలటరీ కమాండ్ తా జా హెచ్చరికలు చేసింది. ఇంతవరకూ ఇజ్రాయెల్, గల్ఫ్ దేశాల్లోని అమెరికా సైనిక స్థావ రాలపై దాడులు జరుపుతున్న తమ దళాలు పశ్చిమాసియాలోని అమెరికా, ఇజ్రాయెల్‌కు సంబంధించిన ఆర్థిక, బ్యాంకింగ్ కేంద్రాలను, టెక్ కంపెనీలను టార్గెట్ చేయనున్నట్టు హెచ్చరించింది.
టెహ్రాన్‌లోని ఇరాన్ బ్యాంక్‌లపై అమెరికా- సంయుక్త దళాలు తాజా దాడి నేపథ్యంలో ఇరాన్ ఈ ప్రకటన చేసింది. ‘అమెరికా, ఇజ్రాయెల్ ఆర్థిక కేంద్రాలను టార్గెట్ చేసేందుకు శత్రువే మాకు అవకాశం ఇచ్చాడు’ అని ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్‌కు చెందిన ఖతం అలన్-అల్ అన్బి యా ప్రధాన కార్యాలయం ప్రతినిధి ఒక ప్రకటనలో తెలిపారు. ఆయా దేశాల్లోని ప్రజలు బ్యాంకులకు 1,000 మీటర్ల దూరం లో ఉండాలని ఆయన హెచ్చరించారు.
టెహ్రాన్‌లోని ఇరానియన్ బ్యాంకుపై అమెరికా, ఇజ్రాయెల్ దళాలు జరిపిన దాడిలో పలువురు ఉద్యోగులు చనిపోయినట్టు ఇరాన్ మీడియా పేర్కొంది. ఇందుకు ప్రతిగా పశ్చిమాసియాలోని అమెరికా, ఇజ్రాయెల్‌కు చెందిన ఆర్థిక, బ్యాంకింగ్ కేంద్రాల పై దాడులు చేస్తామని ఇరాన్ హెచ్చరించినట్టు ఐఆర్‌ఎన్‌ఏ వార్త సంస్థ వెల్లడించింది. ఇరాన్ తాజా హెచ్చరికలతో ముఖ్యంగా దుబాయ్, యూఏఈలోని పెద్ద సంఖ్యలో ఉన్న అంతర్జాతీయ బ్యాంకులు, ఆర్థిక సంస్థలకు ముప్పు తలెత్తే ప్రమాదం ఉందని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
సౌదీ అరేబియా, బహ్రెయిన్‌లలోనూ ప్రధానమైన ప్రాంతీయ ఆర్థిక కేంద్రాలు ఉన్నాయి. మరోవైపు, పర్షియన్ గల్ఫ్ వెంబడి ఇరాన్ మిలటరీ దాడులు చేస్తోంది. ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే అంతర్జాతీయ ట్రావె ల్ హబ్‌లోలో ఒకటైన దుబాయ్ ఇంటర్నేషనల్ విమానాశ్రయం సమీపంలో ఇరాన్ డ్రోన్లతో దాడి చేసింది. ఈ దాడుల్లో నలుగురు గాయపడ్డారని అధికారులు తెలిపారు.
వీరిలో ఒక భారతీయుడు స్వల్పంగా గాయపడ్డాడు. ఇరాన్ కాల్పులను అడ్డుకున్నట్లు యూఏఈ వైమానిక సైన్యాలు తెలిపాయి. అయితే విమాన సర్వీసులు కొనసాగుతున్నట్టు అధికారులు తెలిపారు. ఎనిమిది ఇరాన్ డ్రోన్లలను కూల్చేసినట్టు కువైట్ ప్రకటించగా, తమ ఆయిల్ ఫీల్ దిశగా వెళ్తున్న డ్రోన్లను కూల్చేసినట్టు సౌదీ అరేబియా తెలిపింది. దాడుల కారణంగా హోర్జుజ్ జల సంధి వెంబడి వాణిజ్య నౌకలు నిలిచిపోయి వరుసగా ఐదోరోజు కూడా ఆయిల్ సరఫరాలకు తీవ్ర అంతరాయం కలిగింది.
క్షేమంగా ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ మొజ్తాబా
ఇరాన్ కొత్త సుప్రీం నేత మొజ్తా బా ఖమేనీ మధ్యప్రాచ్యంలో జరుగుతున్న ఘర్షణల్లో గాయపడినట్టు వచ్చిన వార్తలను ఆ దేశ అధ్యక్షుడు మసౌద్ పెజిష్కియాన్ కుమారుడు యూసఫ్ పెజిష్కియాన్ బుధవారం ఒక ప్రకటనలో ఖండించారు. మొజ్తా బా ఆరోగ్యంతో, సురక్షితంగా ఉన్నారని తెలిపారు. ఇరాన్ కొత్త సుప్రీం నేత మొజ్తాబా ఖమేనీ మధ్య ఆసి యా దేశాల్లో జరుగుతున్న ఘర్షణల్లో గాయపడినట్టు వచ్చిన వార్తల ను ఆ దేశ అధ్యక్షుడు మసౌద్ పెజిష్కియాన్ కుమారుడు యూసఫ్ పెజిష్కి యాన్ ఖండించారు.
ఖమేనీ ఆరో గ్యం, ఆచూకీ విషయంపై ఊహాగానాల నేపథ్యంలో యూసఫ్ తాజా ప్రకటన చేశారు. మొజ్తాబా గాయపడినట్టు వస్తున్న వార్తలు తన దృష్టికి వచ్చాయని, ఆయనతో టచ్లో ఉన్న స్నేహితులతో ఈ విషయమై ఆరా తీసానని యూసఫ్ తెలిపారు. ఆయ న సురక్షితంగా, ఆరోగ్యంగా ఉన్నట్టు వారు తెలిపారని చెప్పారు.




