15 June, 2026 | 7:01 PM

Breaking News

పాఠశాలలు, వసతి గృహాలు, ఆరోగ్య కేంద్రాల్లో పరిశుభ్రత, నాణ్యమైన సేవలపై ప్రత్యేక దృష్టి సారించాలి   •   గిడ్డంగుల్లో ధాన్యం నిల్వతో అధిక లాభాలు   •   రేషన్ షాపుల ద్వారా ఉచితంగా 14 రకాల నిత్యవసర సరుకులు అందించాలి   •   ప్రైవేటు భూములను రిజిస్ట్రేషన్ నిషేధిత జాబితా(22-ఏ)నుండి విముక్తి కల్పించండి   •   కోర్ట్ కు సిమెంట్ బెంచీల వితరణ   •   ప్రభుత్వ బడులను మూసివేసే కుట్ర, ముఖ్యమంత్రి మానుకోవాలి.   •   అన్ని దానాలకన్న అన్నదానం మిన్న   •   కీతవారిగూడెంలో ఉపాధి హామీ పథకానికి తూట్లు   •   ఉపముఖ్యమంత్రిని కలిసిన అరెపల్లి   •   దోమకొండ కెనరా బ్యాంకులో సైబర్ మోసాలపై అవగాహన   •  

అధికారులు అప్రమత్తంగా ఉండాలి

15-07-2024 02:45 AM
  1. పురపాలక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిశోర్
  2. వర్ష ప్రభావిత ప్రాంతాల్లో పర్యటన 

హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 14 (విజయక్రాంతి): నగరంలో భారీ వర్షం కురిసిన నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ, జలమండలి అధికారులు అప్రమత్తంగా ఉండాలని పురపాలక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిశోర్ ఆదేశించారు. ఆదివారం సాయంత్రం భారీ వర్షం కురవడంతో వర్ష ప్రభావిత ప్రాంతాల్లో ఆయన పర్యటించారు. శేరిలింగంపల్లి, ఖైరతాబాద్, దుర్గం చెరువు, నెక్టర్ గార్డెన్ తదితర ప్రాంతాలను పరిశీలించారు.

జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి, జలమండలి ఉన్నతాధికారులతో ఫోన్‌లో మాట్లాడి క్షేత్రస్థాయిలో పరిస్థితుల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జలమండలి ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీంలు, ఎన్టీఆర్‌ఎఫ్ బృందాలను రంగంలోకి దించాలని సూచించారు. సమస్యాత్మక ప్రాంతాల్లో ఈ బృందాలు పర్యటించి పరిస్థితులను చక్కదిద్దాలని ఆదేశించారు. ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ క్షేత్రస్థాయిలో పరిస్థితుల్ని తెలుసుకోవాలని సూచించారు.