28 April, 2026 | 7:17 PM

తుమ్మల నివాసంలో పూర్వ మిత్రుల కలయిక

28-04-2026 05:14 PM

దమ్మపేట,(విజయక్రాంతి): మండల పరిధి గండుగులపల్లి లోని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నివాసంలో మంగళవారం పలు ప్రాంతాలకు చెందిన ఆయన పాత మిత్రులు, సీనియర్ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. పాల్వంచ, పినపాక, వేంసూర్, భద్రాచలం, కల్లూరు ప్రాంతాల నుండి మంత్రి  మిత్రులు భవాని శంకర్, కిలారి నాగేశ్వరరావు, వెల్ది జగన్ మోహన్, సంజీవ్ రెడ్డి తదితరులు మంత్రిని కలిసి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా తమ ఉమ్మడి రాజకీయ ప్రస్థానం, పాత మిత్రుల యోగక్షేమాలను మంత్రి అడిగి తెలుసుకున్నారు. సుదీర్ఘ కాలం తర్వాత పాత మిత్రులను కలుసుకోవడం పట్ల మంత్రి తుమ్మల సంతోషం వ్యక్తం చేశారు. ఆయా నియోజకవర్గాల్లోని తాజా రాజకీయ పరిస్థితులు, ప్రజా సమస్యలపై వారితో ప్రత్యేకంగా చర్చించారు. ఈ కార్యక్రమంలో కొయ్యల అచ్యుతరావు, పైడి వెంకటేశ్వరరావు, కాసాని నాగప్రసాద్ తదితరులు ఉన్నారు.