28 April, 2026 | 6:15 PM

Breaking News

గ్రామ గ్రామాన" మేడే" జెండా ఎగురవేయాలి   •   ప్రభుత్వం నిర్వహించే వైద్య శిబిరాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి   •   రైతుల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్న రేవంత్ రెడ్డి సర్కార్   •   రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి గాయాలు   •   విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో పల్లె బాట   •   గుర్తుతెలియని వాహనం ఢీకొని ఒకరికి తీవ్ర గాయాలు   •   ప్రజల దాహం తీర్చిన సీనియర్ హైకోర్టు న్యాయవాది మొహ్మద్ మొయిన్ అహ్మద్ ఖాద్రి   •   జొన్నల కొనుగోలు సెంటర్లను పెంచండి   •   తుమ్మల నివాసంలో పూర్వ మిత్రుల కలయిక   •   అశ్వాపురం ప్రభుత్వ ఆసుపత్రిలో డయాలసిస్ సెంటర్ మంజూరుపై ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు   •  

అశ్వాపురం ప్రభుత్వ ఆసుపత్రిలో డయాలసిస్ సెంటర్ మంజూరుపై ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు

28-04-2026 04:53 PM

అశ్వాపురం,(విజయక్రాంతి): అశ్వాపురం ప్రభుత్వ ఆసుపత్రిలో డయాలసిస్ సెంటర్ మంజూరుకు పినపాక నియోజకవర్గ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లుకు మండల కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ఓరుగంటి రమేష్ బాబు మంగళవారం పత్రికాముఖంగా కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పినపాక నియోజకవర్గంలో కిడ్నీ వ్యాధులతో బాధపడుతున్న ప్రజల ఇబ్బందులను గుర్తించి అశ్వాపురం మండలం సహా నాలుగు మండలాల్లో డయాలసిస్ కేంద్రాలను మంజూరు చేయించడం అభినందనీయమని పేర్కొన్నారు.

ఇంతకాలం డయాలసిస్ కోసం దూర ప్రాంతాలకు వెళ్లి ఆర్థిక, శారీరక ఇబ్బందులు ఎదుర్కొన్న రోగులకు ఇప్పుడు మండల కేంద్రాల్లోనే సేవలు అందుబాటులోకి రావడం ఉపశమనకరమని అన్నారు. ప్రజారోగ్యంపై ఎమ్మెల్యేకు ఉన్న చిత్తశుద్ధి, కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతిబద్ధత ఈ నిర్ణయంతో స్పష్టమవుతుందని రమేష్ బాబు అభిప్రాయపడ్డారు.