28 April, 2026 | 7:01 PM

జొన్నల కొనుగోలు సెంటర్లను పెంచండి

28-04-2026 05:17 PM

ఫోటో. జిల్లా కలెక్టర్ వినతిపత్రం ఇస్తున్న మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కాంగ్రెస్ నాయకులు.

బోథ్,(విజయక్రాంతి): జొన్న పంట దిగుబడి అధికంగా ఉన్నందున నియోజకవర్గంలో జొన్న పంట కొనుగోలు సెంటర్లను పెంచాలని బోత్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ బొడ్డు గంగారెడ్డి జిల్లా కలెక్టర్ ను కోరారు. మంగళవారం ఆదిలాబాద్ లో కలెక్టర్. రాజర్సిష ను కలిసి ఈ విషయమై వినోద్ పత్రం ఇవ్వడం జరిగింది. బోత్ తో పాటు సోనాల, దన్నూర్ బి, మరల పెళ్లి ,పోచర ,బజార్హత్నూర్, దేగామ, ఈచ్చోడ, సిరికొండ, నేరడిగొండ, వాంకిడిలలో నూతనంగా సెంటర్లను ఏర్పాటు చేయాలని కోరారు మండలంలో కనీసం రెండు సెంటర్లను ఏర్పాటు చేసినట్లయితే రైతులకు ఉపయోగకరంగా ఉంటుందని వివరించారు ఆయన వెంట కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి పశువుల చంటి మండల వర్కింగ్ ప్రెసిడెంట్ మహమ్మద్ మాజీ ఏఎంసి డైరెక్టర్ మహమ్మద్ అబ్రార్ సీనియర్ నాయకులు పన్నాల సమందర్ రెడ్డి కుమ్మరి పోశెట్టి లు ఉన్నారు