ఒలంపియాడ్ టాపర్ స్నేహిత్
హైదరాబాద్, మార్చి 11 (విజయక్రాంతి): ఇండియన్ బ్రిలియంట్ ఒలంపియాడ్ (ఐబిఓ) స్టేట్ టాపర్‌గా ఎస్‌విఎం సెంట్రల్ పబ్లిక్ స్కూల్‌లో నాలుగవ తరగతి చదువుతున్న నల్లి స్నేహిత్ నిలిచాడు. గత నెలలో ఐబిఓ నిర్వహించిన నేషనల్ సైన్స్ ఒలంపియాడ్ కాంపిటేటివ్ పరీక్షల్లో స్టేట్ టాపర్‌గా ఎంపికయ్యాడు. బుధవారం హైదరాబాద్ కింగ్ కోటిలోని భారతీయ విద్యా భవన్ ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన కార్యక్రమం లో ఐబిఓ చైర్మన్ రామకృష్ణ,
సినీ నటులు శివ బాలాజీ, విద్యావేత్తలు అవార్డులు, ప్రశంస పత్రాలు అందజేశారు. ఐబిఓ చైర్మన్ రామకృష్ణ చేతుల మీదుగా స్టేట్ టాపర్ బుధవారం నల్లి స్నేహిత్ అవార్డు ప్రశంసా పత్రాన్ని అందుకున్నాడు. స్నేహిత్‌ను ఎస్వీఎం స్కూల్ ప్రిన్సిపల్ ప్రసాద్, ఉపాధ్యాయులు అభినందించారు. స్నేహిత్ తండ్రి నల్లి శ్యాంప్రసాద్ ఖమ్మం జిల్లాలో ప్రముఖ జర్నలిస్టుగా ఉన్నారు.




